Header Banner

కేంద్రం సంచలన నిర్ణయం! త్వరలోనే లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ. 50లకే?

  Wed Feb 19, 2025 09:00        India

 ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST)ను అమలులోకి తెచ్చింది. జీఎస్టీ రాకతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా విధించే ట్యాక్స్‌లు తగ్గిపోయి ఒకే ట్యాక్స్ అమలులోకి వచ్చింది. అయితే పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తోంది. 

 

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై విడివిడిగా ట్యాక్స్‌లు వేస్తున్నాయి. దీంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఉంటున్నాయి. వీటిని కూడా జీఎస్టీ కిందకి తెస్తే రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో వీటిని జీఎస్టీ పరిధిలోకి తేవాలని అంటున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దీనిపై ఏకాభిప్రాయం కుదరట్లేదు. తాజాగా దీని గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేశారు. 

 

2025- 26 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట కలిగిస్తూ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.12 లక్షలకు పెంచింది. రీసెంట్‌గా బడ్జెట్ అనంతరం దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పారిశ్రామికవేత్తలతో జరిగిన ఇంటరాక్షన్ సెషన్‌లో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. 

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ చర్చలో మిడిల్ క్లాస్ వర్గాలకు ముఖ్యమైన ట్యాక్స్ బెనిఫిట్స్ కల్పించడం, గిగ్ వర్కర్స్‌కి సోషల్ సెక్యూరిటీ చర్యలు తీసుకోవడంపై డిస్కస్ చేశారు. ఈ ప్రోగ్రామ్‌లో నిర్మలా సీతారామన్ కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందని చెప్పారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలక రంగాలైన MSMEలు, వ్యవసాయంపై పెట్టుబడులు పెంచే దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. 

 

ఈ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌.. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం గురించి అడిగిన ప్రశ్నకు ఆమె రెస్పాండ్ అయ్యారు. ఫ్యుయల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ‘మేం ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాం. కానీ, రాష్ట్రాలే మిగతా నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది’ అన్నారు. అంటే, జీఎస్టీ పరిధిలోకి తేవడానికి రాష్ట్రాలు సమ్మతిస్తే త్వరలోనే అది అమలులోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. 

 

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సైతం ఈ విషయంపై మాట్లాడారు. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తేవాలా? వద్దా? అనే విషయాన్ని రాజ్యంగ సంస్థ అయిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి, వారందరి అంగీకారం వచ్చాకే తుది నిర్ణయం ఉంటుందన్నారు. ఇప్పటివరకు ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా తీసుకున్నామని, ఇకపై కూడా అదే విధంగా ఉంటుందని రిపోర్టర్లకు చెప్పారు. ప్రస్తుతం, పెట్రోల్, డీజిల్‌పై వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ వంటి పన్నులు అమలు అవుతున్నాయి. అందుకే, వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వేర్వేరుగా ఉన్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #Petrol #Diesel #Fuel #CentralGovernment